బాహుబలి' స్పూఫ్లో బర్నింగ్ స్టార్ సంపూ..
'బాహుబలి'.. ఇప్పటికీ ఇది సెన్సేషన్ సృష్టిస్తూనే వుంది. రాజమౌళి, ప్రభాస్ పాపులారిటీ ఈ మూవీలాగే చెక్కుచెదరకుండా వుంది కూడా. దీన్నే స్ఫూర్తిగా తీసుకున్నాడు బర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్‌బాబు. తనదైన స్టైల్లో కామెడీ స్పూఫ్గా తీశాడు.
యాంకర్ సుమ శివగామిగా, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ కట్టప్పగా ఇందులో నటిస్తే.. సంపూ మాత్రం 'బాహుబలి'గా, పైరసీ కేయుడుగా యాక్ట్ చేయడం విశేషం. 'మా టీ అవార్డ్స్' పేరిట ఈ స్పూఫ్ని ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ నిర్మించింది. అన్నట్లు ఇది కేవలం నవ్వుకోవడానికేనట.నిజానికి.. ఇప్పటివరకు ఇలాంటి కామెడీ స్పూఫ్లలో సుమ పక్కన కమెడియన్ ఆలీ కనిపించేవాడు. కానీ.. ఈ సారి ఈసారి అతని ప్లేస్ను బర్నింగ్‌స్టార్ సంపూ ఆక్రమించడం విశేషం. ఓ అవార్డును సంపూ గెలుచుకోగా.. దానికి పైరసీకేయుడు అడ్డుపడడమే దీని ఇతివృత్తమట. అలాగే.. మాటీవీ అవార్డుల టైటిల్ని తమాషాగా 'మా టీ అవార్డ్స్'గా మార్చడం సరికొత్త ఎక్స్పెరిమెంట్.

0 comments :
Post a Comment