చిరు చేతికి జన సేన
ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి..
ప్రతి రోజు ఏదో ఒక ఇష్యూతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.. పార్టీల
నేతలను టార్గెట్ చేస్తూ తమ పార్టీలలోకి గుంజుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు..
ముఖ్యంగా జనసేన పార్టీ పై అందరి అంచనాలు తలక్రిందులు అవుతున్నాయి.. ఈ పార్టీని
బలోపేతం చేస్దాడా లేదా 2019 లో బరిలోకి దిగుతున్నాడా లేదా అనే విషయంలో ఎవరికీ
స్పష్టమైన సమాచారం లేదు.. తాజాగా జనసేన పార్టీ పై కొన్ని వార్తలు వెలువడుతున్నాయి.
కొత్త రాజధాని అమరావతి వేదికగా మెగా బ్రదర్స్ రాజకీయం మొదలు పెడతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుకను పొలిటికల్ గా కూడా ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. త్వరలోనే ఆడియో ఫంక్షన్ నిర్వహించేందుకు పవన్ ఏర్పాట్లు చేస్తున్నాడు. అదే వేదికపై ముగ్గురు మెగా బ్రదర్స్ ఫ్యాన్స్ కి కనువిందు చేయనున్నారు. ఇక పవన్ కళ్యాణ్ చెప్పినా చెప్పకపోయినా కాపులకు నాయకుడిగా ఉన్నాడు. తన అశేషమైన అభిమానులతో రాజకీయంగా కూడా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాడు. తన అన్న చిరంజీవి కాంగ్రెస్ లో ఉంటే, తాను వీక్ అవుతున్నానని, ఇటు చిరుకు కూడా చెడ్డ పేరు వస్తుందని భావిస్తున్నాడు. అందుకే కాంగ్రెస్ ను జనం ఆదరించడంలేదు కాబట్టి….జనసేనతో చిరు ను కలుపుకుని వచ్చే ఎన్నికల్లో జనంలోకి వెళ్లాలని భావిస్తున్నాడు. అందుకే అధ్యక్షుడిగా తాను ఉండి చిరును పక్కన పెట్టుకుని పార్టీని నడిపించాలని పవన్ భావిస్తున్నట్లు సమాచారం. మొత్తం చిరుకే అప్పగిస్తే మరో ప్రజారాజ్యం అంటారనే భావనతో…అధ్యక్షుడిగా ఉంటారట. వ్యవహారాలు మాత్రం చిరంజీవే చూస్తారని ఆయన సన్నిహితులంటున్నారు.

0 comments :
Post a Comment