Breaking News
Loading...
Friday, December 11, 2015

సమంత ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్


సమంత తన అభిమానులను ఉత్సాహ పరిచే పనేమైనా చేసిందా..! అసలే అమ్మడికి సోషల్ రెస్పాసిబిలిటీ ఎక్కువ కదాని ఆలోచిస్తుండొచ్చు. ఆ విషయంలో సమంత అందరి హీరోయిన్స్ కన్నా ముందంజలోనే ఉంది.. అది ప్రత్యేకంగా చెప్పాల్సిన
పనిలేదు లేండి. కాని సంవత్సరానికి రెండు మూడు సినిమాలతో అలరించే సమంతా ఈ సంవత్సరం తెలుగులో కేవలం సన్నాఫ్ సత్యమూర్తిలోనే కనిపించి అలరించింది.

ప్రస్తుతం చేస్తున్న అ..ఆ, బ్రహ్మోత్సవం ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నాయి.. అవి వచ్చే ఏడాది రిలీజ్ అవుతున్నాయి. అంటే ఈ ఇయర్ సమంత ఒక్క సినిమాతోనే సరిపెట్టుకోవాల్సిందేనా అనుకున్నారు ఫ్యాన్స్ అంతా.. కాని తమిళ్ లో చేసిన 'తంగమగన్' సినిమా తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ధనుష్ హీరోగా చేస్తున్న ఈ సినిమాను రఘువరన్ బి.టెక్ దర్శకుడు వేల్ రాజా డైరెక్ట్ చేశాడు.

తెలుగులో 'నవమన్మధుడు'గా ఈ నెల చివరన రిలీజ్ అవుతుంది. ఈ ఇయర్ మొత్తం మాతృభాషలోనే ఎక్కువ సినిమాలు చేసిన అమ్మడు అక్కడ హిట్ మాత్రం దక్కించుకోలేపోయింది. మరో రెండు వారాల్లో సమంత మళ్లీ థియేటర్లో సందడి చేస్తుందన్నమాట. ధనుష్ హీరోగా చేసిన ఈ సినిమాలో సమంతతో పాటు ఏమీ జాక్సన్ కూడా సినిమాలో నటించింది.


0 comments :

Post a Comment

Back To Top